పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

● *అన్వర్‌ పాషాకు రూ.2.20 లక్షల చెక్కు అందజేత*

● *మంత్రి పొంగులేటి చొరవతో ఆర్థిక వెసులుబాటు*

ఖమ్మం బ్యూరో, జనవరి 27(తెలంగాణ ముచ్చట్లు)

అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) భరోసానిచ్చింది. ఏదులాపురం మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన షేక్‌ అన్వర్‌ పాషా కుమారుడు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం భారీగా ధనం వెచ్చించారు.  ఈ విషయాన్ని స్థానిక యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఏనుగు మహేష్‌.. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేయించారు. మంత్రి సిఫారసుతో ప్రభుత్వం నుంచి రూ.2,20,000 మంజూరయ్యాయి. మంగళవారం మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుడు అన్వర్‌ పాషా ఈ చెక్కును అందుకున్నారు. కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రికి, సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .