వల్భాపూర్ గ్రామ యువతకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్‌కు గ్రామ పంచాయతీ వినతి

వల్భాపూర్ గ్రామ యువతకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

ఎల్కతుర్తి, జనవరి 27: (తెలంగాణ ముచ్చట్లు)

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్భాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుద్యోగ యువతి, యువకులకు రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంబంధిత సంస్థ అధికారికి వినతి పత్రం అందజేశారు.
సూరారం గ్రామ పరిధిలో నిర్మాణం పూర్తి చేసుకున్న రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ సంస్థలో వల్భాపూర్ గ్రామానికి చెందిన అర్హత కలిగిన నిరుద్యోగ యువతి, యువకులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ పంచాయతీ ప్రతినిధులు కోరారు. గ్రామ యువతకు ఉపాధి కల్పిస్తే వారి ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు గ్రామాభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత శ్రీనివాస్ మాట్లాడుతూ, స్థానికంగా ఏర్పాటు అవుతున్న పరిశ్రమలు గ్రామ యువతకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామ పరిధిలోని నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా సంస్థ యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత శ్రీనివాస్, ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!