పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు. జర్నలిస్టులకు శాశ్వత వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని గతంలో జర్నలిస్టుల బృందం ఎమ్మెల్యే మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే ప్రభుత్వ స్థలంలో సర్వే చేసి జర్నలిస్టులకు అనువైన స్థలాన్ని కేటాయించాలని తహసిల్దార్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.ఈ మేరకు తహసిల్దార్ పాండు నాయక్ సూచనలతో డిప్యూటీ తహసిల్దార్ రాజేంద్రప్రసాద్, ఆర్‌ఐ గణేష్, సర్వేయర్ మన్యం మంగళవారం రైతు వేదిక పరిసరాల్లోని సర్వే నంబర్ 824లో కొంత స్థలాన్ని గుర్తించారు. గుర్తించిన స్థలానికి సంబంధించిన లొకేషన్ మ్యాప్‌ను సిద్ధం చేసి తహసిల్దార్‌కు నివేదించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం.ఈశ్వర్‌తో పాటు జర్నలిస్టులు గోపాల్ చారి, శ్రీనివాస యాదవ్, చంద్రశేఖర రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, శివకుమారాచారి, బుద్వేష్, సురేందర్ గౌడ్, అశోక్, నాగరాజు, రామ్ నరేష్, మన్యం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments