అవకాశమిచ్చి ఆశీర్వదించండి

అవకాశమిచ్చి ఆశీర్వదించండి

-4వ డివిజన్ నుంచి మీ బిడ్డగా ముందుకొస్తున్నా

 – కాశిపాక మురళీకృష్ణ

కరీంనగర్,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు) :

కరీంనగర్ నగరంలోని నాలుగో డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల మధ్యే పెరిగిన మీ బిడ్డగా కార్పొరేటర్ పదవికి పోటీ చేస్తున్న కాశిపాక మురళీకృష్ణ, ప్రజలు తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే డివిజన్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి కరీంనగర్‌లోనే ఆదర్శంగా నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించాలని కోరుతూ ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తన ప్రయాణం ప్రజల సమస్యలతో ముడిపడి ఉందని పేర్కొన్న కాశిపాక మురళీకృష్ణ, యువత, మహిళలు, పేదలు, మధ్యతరగతి ప్రజల అవసరాలు తనకు బాగా తెలుసన్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారి సమస్యలను నేరుగా విని పరిష్కరించడమే తన రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు. మాటల్లో కాదు, పనుల్లోనే అభివృద్ధిని చూపించాలన్న సంకల్పంతో ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తున్నానని తెలిపారు.

తాను 2014 నుంచి 2016 వరకు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేశానని గుర్తు చేశారు. అనంతరం 2016 నుంచి 2018 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా యువతకు ఉపాధి, హక్కుల అంశాలపై చురుకుగా పనిచేశానన్నారు. అలాగే 2018 నుంచి 2022 వరకు దుర్షేడ్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా, 2018 నుంచి 2023 వరకు వార్డు సభ్యుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అనేక సమస్యలను పరిష్కరించిన అనుభవం తనకు ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ పార్టీ బలోపేతంతో పాటు ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించానని చెప్పారు.

నాలుగో డివిజన్‌లో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, పార్కులు, విద్యా–ఆరోగ్య వసతులు వంటి మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కాశిపాక మురళీకృష్ణ హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రత, వృద్ధులకు సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తా

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!