న్యాయవాదుల కోసం సెవెన్ రా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్
మల్కాజిగిరి, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం సెవెన్ రా ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ అభినందనీయమని అసోసియేషన్ నాయకులు ప్రశంసించారు. మంగళవారం కుషాయిగూడ కోర్టు ప్రాంగణంలో సెవెన్ రా ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది తిప్పారపు కీర్తి కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్‌లో న్యాయవాదులకు షుగర్, బీపీ, హెచ్‌బీఏ1సీ, దంత పరీక్షలు, కంటి పరీక్షలు వంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. వందలాది మంది న్యాయవాదులు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
న్యాయవాదుల ఆరోగ్య పరిరక్షణకు సెవెన్ రా ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రశంసనీయమని బార్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బాపిరెడ్డి, అమరేందర్ రెడ్డి, రాజభక్షి శ్రీనివాస్, అరుణ్ చంద్ర, కే. శ్రావణ్, శివ తదితరులు పాల్గొన్నారు.


Comments