నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

వెల్టూర్ లో సీసీ కెమెరాల ప్రారంభం భద్రత మరింత పటిష్టం 

-- వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి 

పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన 10 అధునాతన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ కెమెరాలను ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, అవి 24 గంటలు నిరంతరం పనిచేస్తూ నేరాల నివారణకు, నిందితుల గుర్తింపుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.నేరాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో గ్రామాలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు.సీసీ కెమెరాల ఫుటేజీని వనపర్తి కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తామని తెలిపారు.సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ముందుకొచ్చిన గ్రామస్తులు, దాతలను జిల్లా ఎస్పీ అభినందించారు .అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తకోట సీఐ రాంబాబు, పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి, వెల్టూర్ సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, మాజీ వైస్ ఎంపీపీ సాఖ వెంకటయ్య, గ్రామ కంటెస్టెంట్  సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, నాగమణి నరేష్, గ్రామ అధ్యక్షులు ప్రేమ సాగర్ , రవీందర్, వివేక్, బిజెపి మాజీ అధ్యక్షుడు రమేష్, రిటైర్డ్ సీఐ బాల్ రెడ్డి,గ్రామ నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260127-WA0026

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!