జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం
Views: 10
On
ఘట్కేసర్, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని జిహెచ్ఎంసి ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఏ. వాణి తో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందికి, ప్రజలకు రోడ్డు ప్రమాదాలను నివారించే మార్గాలు, ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం యొక్క ప్రాముఖ్యతపై వివరించారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారి తీస్తుందని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెరుగుతుందని వారు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Jan 2026 20:08:56
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....


Comments