పెద్దమందడి ప్రాథమిక పాఠశాలకు నిఘా కెమెరాల బహుకరణ
సేవాభావానికి ప్రశంసలు తెలిపిన ఎస్సై జలంధర్ రెడ్డి
పెద్దమందడి, జనవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎనిమిదవ వార్డు సభ్యులు జంగం శివ సహకారంతో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను సోమవారం ముఖ్య అతిథిగా హాజరైన పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపులో నిఘా కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడంలో, ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో నిఘా కెమెరాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.అనంతరం నిఘా కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాత జంగం శివ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుడుకుంట్ల వెంకటస్వామి , మాజీ వార్డు సభ్యులు రామాంజనేయులు , ప్రస్తుత నాలుగో వార్డు సభ్యులు తన్నీర్ అహ్మద్,వాకిటి నరేష్ , గ్రామ పంచాయితీ కార్యదర్శి దిలీప్ రెడ్డి , పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments