బీజేపీ సీనియర్ నాయకుడు రాజేశ్వర్ రావుకు ఘన నివాళి
ఎల్కతుర్తి, జనవరి 27: (తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ గ్రామ శక్తి కేంద్రం ఇన్‌చార్జ్, మాజీ గ్రామ సర్పంచ్ సోలంకి రాజేశ్వర్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల కన్నుమూశారు. ఆయన మృతితో గ్రామంలోనే కాకుండా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ సందర్భంగా ఎల్కతుర్తి బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర బీసీ మోర్చా కార్యదర్శి ఎర్రగోల్ల శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజేశ్వర్ రావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నాయకులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి మరియు ప్రజాసేవ రంగాల్లో సోలంకి రాజేశ్వర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, సేవా దృక్పథం యువ నాయకులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని అన్నారు.
ఈ దుఃఖ సమయంలో పార్టీ తరఫున రాజేశ్వర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


Comments