హెల్మెట్‌తోనే రోడ్డు భద్రత… జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ
అయ్యాపు రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత హెల్మెట్ పంపిణీ
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు):
రోడ్డు భద్రతపై బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో అయ్యాపు రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసే కార్యక్రమం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించాలంటే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.ప్రత్యేకంగా జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేయడాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.జర్నలిస్టుల ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన సందేశం విస్తృతంగా ప్రజల్లోకి చేరుతుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అయ్యాపు రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ సేవలను ఆమె ప్రశంసించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు హెల్మెట్లను పంపిణీ చేయడం ద్వారా రోడ్డు భద్రతపై బలమైన సందేశం ప్రజల్లోకి వెళ్తుందని భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.జర్నలిస్టుల కలం ద్వారా ఈ అవగాహన మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా ఎస్పీ సునీత రెడ్డి చేతుల మీదుగా జర్నలిస్టులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు.జర్నలిస్టులు మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేలా తమను గౌరవించి హెల్మెట్లు అందించిన అయ్యాపు రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ నిర్వాహకులకు, అలాగే జంగం శివకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తోపాటు పోలీస్ అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు, జర్నలిస్టులు, మహిళా సమాఖ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments