సత్తుపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ.

సత్తుపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ.

సత్తుపల్లి, జనవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు, సినీ రంగంలో శిఖరస్థాయికి ఎదిగి రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందిన స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్ధంతిని సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా తపనను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు.IMG-20260118-WA0013

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .