తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్–2026 ఆవిష్కరణ.
సత్తుపల్లి, జనవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యలకు ప్రతిబింబంగా నిలుస్తున్న తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక క్యాలెండర్–2026ను సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో అధికారులు ఘనంగా ఆవిష్కరించారు.
సత్తుపల్లిలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జె.ఎన్. శ్రీనివాసరావు తన కార్యాలయంలో తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్–2026ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే వార్తలు, సమకాలీన అంశాలతో పత్రిక ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావడంలో పత్రిక పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.
అదేవిధంగా సత్తుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నాగేశ్వరరావు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ ముచ్చట్లు పత్రిక మరింత ప్రజాదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా సత్తుపల్లి మండలం బి.గంగారం రైతు వేదికలో ఏఈఓ వాసంతికిరణ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలను ప్రాధాన్యంగా ప్రచురిస్తూ తెలంగాణ ముచ్చట్లు పత్రిక సాగిస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల గొంతుకగా పత్రిక నిలవాలని కోరారు.



Comments