పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు
పెద్దమందడి,జనవరి19(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలానికి నూతనంగా నియమితులైన ఎస్సై జలంధర్ రెడ్డి ని బీజేపీ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకునే చర్యలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అలాగే బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు తిరుపతయ్య, జిల్లా కౌన్సిల్ నెంబర్ రామ్ నరేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం కోసం పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.నూతన ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో చట్టసువ్యవస్థలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజాప్రతినిధుల సహకారంతో శాంతి భద్రతలు మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.


Comments