సీపీఐ శతాబ్ది ముగింపు సభకు తరలివెళ్లిన కమ్యూనిస్టులు
ఎల్కతుర్తి, జనవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఎల్కతుర్తి మండలం నుంచి కమ్యూనిస్టులు ఖమ్మం వైపు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలతో, నినాదాలతో ఖమ్మం ప్రయాణం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి ‘చలో ఖమ్మం’ కార్యక్రమానికి బయలుదేరిన బస్సులకు గోపాల్పూర్ సర్పంచ్ కర్రె లక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరి రాములు, లక్ష్మణ్, సీపీఐ మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మర్రి శ్రీనివాస్, కామర వెంకటరమణ పాల్గొన్నారు.
అలాగే తండ మొండయ్య, నిమ్మల మనోహర్, సూర మొగిలి, మోహన్ రెడ్డి, ఆరెపల్లి చంద్రమౌళి, అంబాల స్వామి, మర్రిపల్లి తిరుమల, గడ్డం లలిత తదితర సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీపీఐ వందేళ్ల పోరాట చరిత్రకు ప్రతీకగా నిర్వహిస్తున్న శతాబ్ది ముగింపు సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగుతున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


Comments