ఆర్‌యూబి పనులతో మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్ మార్గంలో ట్రాఫిక్ అవస్థలు
మల్కాజ్‌గిరి, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఆర్‌యూబి నిర్మాణ పనుల నేపథ్యంలో మల్కాజ్‌గిరి నుంచి ఆనంద్‌బాగ్‌కు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రత్యామ్నాయంగా రాఘవేంద్ర థియేటర్ వైపు నుంచి ఆనంద్‌బాగ్‌కు వెళ్లే రోడ్డుపై వాహనాల రాకపోకలు అధికమై అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది.ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు ఈ మార్గంలో కేవలం ద్విచక్ర వాహనాలకే అనుమతి ఉంటుందని సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే వాటిని పట్టించుకోకుండా ఆటోలు, కార్లు కూడాఅదే మార్గంలో వెళ్లడంతో రద్దీ మరింత పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేకంగా కార్యాలయాల ప్రారంభ, ముగింపు సమయాల్లో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా మారుతుండటంతో పాఠశాల వాహనాలు, అత్యవసర సేవల వాహనాలు సైతం నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాఘవేంద్ర థియేటర్ సమీపంలోనే ఆటోలు, కార్లను పోలీసులు అడ్డుకుని మళ్లిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉందని వాహనదారులు కోరుతున్నారు.ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Comments