రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
రిక్వెల్ ఫోర్డ్ స్కూల్లో వ్యాసరచన పోటీ
కీసర, జనవరి 17 (తెలంగాణ ముచ్చట్లు):
రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026” కార్యక్రమంలో భాగంగా, కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం రాంపల్లి గ్రామంలోని రిక్వెల్ ఫోర్డ్ స్కూల్ లో వ్యాసరచన పోటీ నిర్వహించారు.ఈ పోటీలో హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.వ్యాసరచనకు
“ఒక చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన ఒక ప్రాణాన్ని అంతం చేయగలదు”,“రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత”అనే అంశాలను విద్యార్థులకు నిర్దేశించారు.ఈ సందర్భంగా కీసర పోలీసులు విద్యార్థులతో మాట్లాడుతూ,హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అలాగే తప్పుదారి డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ద్వారా కుటుంబ స్థాయిలో ప్రవర్తనా మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు కీసర పోలీసు సిబ్బంది హాజరై సహకరించారు.ఈ సందర్భంగా కీసర పోలీసులు మాట్లాడుతూ, రోడ్డు భద్రతను ప్రజా ఉద్యమంగా మార్చడమే “అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026” ముఖ్య లక్ష్యమని, విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను తాము పాటించడంతో పాటు, ఇతరులను కూడా పాటించేలా ప్రేరేపించాలని పిలుపునిచ్చారు.


Comments