మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు

మేడ్చల్, జనవరి 19 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్కార్పొరేషన్ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా పథకం కింద మేడ్చల్ నియోజకవర్గంలోని మైనార్టీ వర్గాల మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని అత్వెల్లి జీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వారీగా 900, మేడ్చల్ నియోజకవర్గానికి 200 ఉచిత కుట్టు మిషన్లు మంజూరు చేసిన సందర్భంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజీబ్ బుద్దీన్ తదితర నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఇందిరమ్మ మహిళా పథకం ద్వారా మైనార్టీ వర్గాల మహిళలకు ఆర్థిక భద్రతతో పాటు వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయని, నిరుద్యోగ మహిళలు ఈ పథకం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. పేద వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు.


Comments