ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు

నాచారం, జనవరి 18 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌బీ కాలనీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు రామ్ ప్రదీప్ మునుగంటి, బ్రహ్మచారి, తిమ్మారెడ్డి, వీరభద్రరావు, ప్రసాద్, సాంబ, సాయి, మురళి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు హాజరై ఘన నివాళులు అర్పించారు.IMG-20260118-WA0058

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!