జిల్లాలలో స్వయం సహాయక సంఘాల ద్వారా నడిపిస్తున్న యూనిట్లను సందర్శించిన
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల టీం
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో 20 (తెలంగాణ ముచ్చట్లు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేస్ వి పాటిల్ వారి సూచన మేరకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ లత జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి జిల్లాలలోని స్వయం సహాయక సంఘాలు నడుపుతున్న యూనిట్స్ లను సందర్శించినాము ఇందులో భాగంగా పాల్వంచలోని చరిత ఆర్గానిక్ ఉత్పత్తులు మరియు కౌజు పిట్టల పెంపకం నాగారం గ్రామంలోని కొర్ర మినల పెంపకం మరియు చేపల పెంపకం యూనిట్ బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజర్ లోని సేంద్రియ ఎరువులతో కూరగాయల సాగు చేస్తున్న యూనిట్ ను లక్ష్మీదేవి పల్లి మండలంలోని లోతు వాగులో నాటు కోళ్లు బాతుల పెంపకము యూనిట్స్ మరియు చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలోని వెదురు బొంగులతో వస్తువులు ఫర్నిచర్ తయారు చేసే యూనిట్స్ లను సందర్శించినాము ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీమతి శ్రీలత మరియు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ లకావత్ వెంకటేశ్వర్లు లావుడియా సామ్యా నాయక్ లక్ష్మీబాయి మరియు కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఆర్ వి ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


Comments