కుషాయిగూడలో ఇందిరమ్మ కాంటీన్ పరిశీలన

నాణ్యమైన భోజనం అందించడంలో లోపాలు ఉండకూడదు: బొంతు శ్రీదేవి

కుషాయిగూడలో ఇందిరమ్మ కాంటీన్ పరిశీలన

కుషాయిగూడ, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాంటీన్‌ను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంటీన్‌లో అందిస్తున్న ఆహార నాణ్యత, శుభ్రత, వసతుల నిర్వహణ తీరును ఆమె సమీక్షించారు.ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం చౌక ధరలో అందించడమే ఇందిరమ్మ కాంటీన్ ముఖ్య లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం తలెత్తకూడదని, కాంటీన్ నిర్వహణలో అన్ని ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.పేదలు, కూలీలు, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకం ద్వారా ప్రజలకు మేలు చేకూరాలని, ఇందిరమ్మ కాంటీన్ సేవలు మరింత మెరుగుపడేలా కృషి చేస్తామని ఆమె తెలిపారు.IMG-20260128-WA0036

Tags:

Post Your Comments

Comments

Latest News