మున్సిపాలిటీలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యం

టిఆర్పి వనపర్తి జిల్లా అధ్యక్షుడు దాడే విజయ్ యాదవ్

మున్సిపాలిటీలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యం

వనపర్తి,జనవరి28(తెలంగాణ ముచ్చట్లు):

 వనపర్తి జిల్లా అమరచింత మండల మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి వార్డులో బీసీలు పోటీ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు దాడే విజయ్ యాదవ్ పిలుపునిచ్చారు. పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్క బీసీ ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా పామిరెడ్డి పల్లి వార్డులను సందర్శించిన దాడే విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలు ఉచిత భావంతో ముందుకు వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అండగా నిలవాలని, మున్సిపాలిటీలో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీల గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు డి. విజయ్ యాదవ్‌తో పాటు మణికంఠ, సంపత్, సందీప్, శివకుమార్, అశోక్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఏకాంబరు, చరణ్ కుమార్, హనుమంతు, నరసింహారెడ్డి, బీసీ రెడ్డి, భాస్కర్, మాధవరెడ్డి, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News