కాప్రా మండలంలో ముఖ్యమంత్రి కప్–2025–26

మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభం

కాప్రా మండలంలో ముఖ్యమంత్రి కప్–2025–26

కుషాయిగూడ, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):

ముఖ్యమంత్రి కప్–2025–26లో భాగంగా కాప్రా మండల స్థాయి 2వ ఎడిషన్ క్రీడా పోటీలు మంగళవారం కుషాయిగూడలోని జడ్పీహెచ్ఎస్ కుషాయిగూడ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అధికారులు, విద్యాశాఖ ప్రతినిధుల సమక్షంలో ఈ క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బి. రాజేష్, సీఐ భాస్కర్, ఎస్‌ఐ శ్రీనివాస్, ఎన్‌జీఓ ప్రతినిధి నరసిములు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.అలాగే జడ్పీహెచ్ఎస్ కుషాయిగూడ హెచ్‌ఎం అరుణా దేవి, ఎం.ఎం. పద్మావతి, పీడీ సునీల్, పీడీ వరలక్ష్మి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ మండల స్థాయి టోర్నమెంట్‌లో కాప్రా మండల పరిధిలోని పాఠశాలల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొని ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్, క్యారమ్స్, చెస్ వంటి విభిన్న క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.మొదటి రోజు బాలికల ఖో–ఖో, జూనియర్ బాలుర ఫైనల్స్‌తో పాటు చెస్, ఖో–ఖో, గిట్స్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. వాలీబాల్ ఫైనల్ మ్యాచ్‌లు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి.బుధవారం కబడ్డీ, క్యారమ్స్ IMG-20260128-WA0029పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News