భగాయత్‌లో అభివృద్ధి పనులకు మోక్షం కలిగింది
_రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, రూ.3 కోట్లతో కమ్యూనిటీ హాల్‌కు ప్రతిపాదనలు
_కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి అధికారుల పర్యటన
ఉప్పల్, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో ఎన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. అదే సమయంలో స్థానికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు మోక్షం కలగనుంది.ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సోమవారం హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫ్ రాజ్ అహ్మద్‌ను కలిసి భగాయత్ లే అవుట్‌లోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, రహదారుల మరమ్మతులు తదితర అంశాలను వివరించారు. ఈ భేటీతోనే యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించింది.మంగళవారం హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ అధికారులు ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి, మందుముల పరమేశ్వర్ రెడ్డితో కలిసి భగాయత్ లే అవుట్‌లో విస్తృతంగా పర్యటించారు. కాలనీలోని వీధులు, మౌలిక వసతులను పరిశీలిస్తూ స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రూ.10 కోట్లతో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్, రూ.3 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు అంతర్గత రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అంతవరకు అత్యవసరంగా అవసరమైన రహదారుల మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ డీఈ సత్యప్రసాద్, ఏఈ వెంకటేష్, జీహెచ్ఎంసీ డీఈ వెన్నెల్ గౌడ్, ఏఈ రాజ్‌కుమార్, ఎలక్ట్రికల్ డీఈ అనిత, సానిటేషన్ ఏఈ పుష్పలత పాల్గొన్నారు. అలాగే భగాయత్ కాలనీ సభ్యులు శ్రీనివాస్ రావు, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాంచందర్ రెడ్డి, వంశీదర్ రెడ్డి, సూర్య గోపాల్, శ్రీపతి రావు, ఈగ సంతోష్ ముదిరాజ్, నిధనకవి సుధాకర్, పూజల ప్రభాకర్, సోమ్ జంగయ్య, సల్లా ప్రభాకర్ రెడ్డి, విప్లవ్రెడ్డి
బండారి శ్రీనివాస్ గౌడ్, సచిత్, రవీందర్ రావు, చారి, విజయ్, చంద్రశేఖర్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, రంగనాథ్, అంజి రెడ్డి, అర్షద్, మహేష్, మూర్తి, వినయ్, దుర్గ ప్రసాద్, నవీన్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments