కేశవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న నాగారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్–మల్కాజిగిరి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగారం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో ముప్పు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు.కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


Comments