సరస్వతీ నగర్‌లో వాకింగ్ ట్రాక్ ప్రారంభం
20 లక్షల వ్యయంతో ప్రజలకు ఆరోగ్య సౌకర్యం
నాచారం, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ సరస్వతీ నగర్ కాలనీలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్‌తో పాటు స్టోర్ రూమ్‌ను సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. పనులు పూర్తికావడంతో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌తో కలిసి ఈ సౌకర్యాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, స్థానికుల కోరిక మేరకు త్వరలోనే ఇక్కడ ఓపెన్ జిమ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వాకింగ్ ట్రాక్ ద్వారా కాలనీవాసులు ఆరోగ్యంగా జీవించేందుకు మంచి అవకాశం కల్పించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఈ ఉమామహేశ్వరి, ఏఈ సూరజ్, వర్క్ ఇన్స్పెక్టర్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాపూజీ నగర్ మరియు సరస్వతీ నగర్ కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments