గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలి.

దమ్మపేట మండల బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల వినతి.

గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలి.

అశ్వారావుపేట, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):

దమ్మపేట మండలంలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ నాయకుడు సోయం వీరభద్రం, దమ్మపేట మండల బీఆర్‌ఎస్ సర్పంచ్‌లతో కలిసి గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం మరియు మండల రెవెన్యూ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, నూతన ఎంఆర్వో రామ్ నరేష్ యాదవ్‌లను వారి చాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించారు.
గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి అర్హులకు పట్టా పాస్‌బుక్‌లు మంజూరు చేయాలని ఎంఆర్వో దృష్టికి తీసుకువెళ్లారు. నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయితీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు. గ్రామాభివృద్ధికి తక్షణమే చర్యలు చేపట్టాలని, పంచాయితీరాజ్ నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కొమ్ముగూడెం సర్పంచ్ సోయంసత్యవతి, పార్కెలగండి సర్పంచ్ కొమరం సుశీల,IMG-20260129-WA0097 తాటిసుబ్బన్నగూడెం సర్పంచ్ సవలం స్వాతి, గున్నేపల్లి సర్పంచ్ తొగత్త అనిత, పెద్ద గొల్లగూడెం సర్పంచ్ యట్ల రామ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News