కాంగ్రెస్ పథకాలే గెలుపునకు బాట.!

ఎండి రెహానా బేగం.

కాంగ్రెస్ పథకాలే గెలుపునకు బాట.!

సత్తుపల్లి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డుల సభ్యుల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎలక్షన్ అధికారుల పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండగా, పోటీ తీవ్రతను సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం 22వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎండి కమల్ పాష సతీమణి ఎండి రెహానా బేగం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ఆమె మాట్లాడుతూ, 22వ వార్డులో పోటీ చేసే అవకాశం కల్పించిన శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఆ పథకాలను విశ్వసించిన ప్రజలు తమకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News