సల్కెలపూర్ ఘటన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి

సల్కెలపూర్ ఘటన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి

క్రిస్టియన్ల పై దాడులు అణిచివేతకు నిదర్శనం 

– ఆర్‌ఎంపీ రాష్ట్ర నాయకులు  డిమాండ్

ఖిల్లా ఘనపూర్,జనవరి28(తెలంగాణ ముచ్చట్లు):

క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులు మత స్వేచ్ఛను అణిచివేయడమేనని ఆర్‌ఎంపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు.ఆర్‌ఎంపీ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ ఆదేశాల మేరకు చేపట్టిన చలో వనపర్తి కార్యక్రమంలో భాగంగా ఈ ఘటనపై ఘాటైన నిరసన వ్యక్తం చేశారు.వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం సల్కెలపూర్ గ్రామంలో ఆదివారం హెబ్రోన్ పాస్టర్ డేవిడ్ తన సతీమణి మరియు సంఘ సభ్యులతో కలిసి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో వారి ఇంటిపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆర్‌ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. వెంకటేశ్  తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖిల్లా ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో స్థానిక ఎస్సై కి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించుకునే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆ హక్కును హరించే ప్రయత్నాలను సహించబోమని ఆర్‌ఎంపీ నాయకులు స్పష్టం చేశారు.పాస్టర్ కుటుంబానికి మరియు సంఘ సభ్యుల ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నర్సింలు, మధు పాలమాకుల సువార్త రాజు , స్వరాజ్ , సత్య రాజు, ప్రభు, ప్రభుదాస్,  సునిల్ రాజ్ , ఫిల్లిప్ , కృష్ణా, సురేష్ ,షెకీన్, సుధాకర్ తదితర ఆర్‌ఎంపీ రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News