మహిళలు స్వశక్తితో ఎదగాలి లయన్ చంద్రమోహన్ నరేసేపల్లి
నాచారం, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలంటే నైపుణ్యాభివృద్ధి కీలకమని లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ అధ్యక్షుడు లయన్ చంద్రమోహన్ నరేసేపల్లి అన్నారు. నాచారంలోని వీర సావర్కర్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, వీర సావర్కర్ నగర్ కాలనీ అసోసియేషన్ సహకారంతో మహిళలకు మూడు నెలలపాటు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు 50 శాతం సబ్సిడీతో 26 కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అలాగే లయన్స్ క్లబ్ నాచారం సాకారంతో మరో 6 కుట్టుమిషన్లు అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మహిళలు స్వశక్తితో నిలబడితే కుటుంబ ఆర్థికాభివృద్ధికి బలంగా మారతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్‌పర్సన్ ప్రకాష్, ప్రాజెక్ట్ కో–చైర్మెన్ ప్రవీణ్ కుమార్, లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ కోశాధికారి లయన్ విజేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్
నాచారం సభ్యుడు నందికొండ శ్రీనివాస్ రెడ్డి, వీర సావర్కర్ నగర్ అధ్యక్షుడు వేంకట రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొగ్గారపు రమేష్‌తో పాటు లయన్స్ క్లబ్ నాచారం సభ్యులు పాల్గొన్నారు.


Comments