సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి
ఉప్పల్, జనవరి (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ డివిజన్ పరిధిలోని రాజ్‌నగర్ కాలనీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి అన్నారు. రాజ్‌నగర్ కాలనీలో రూ.42 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు స్థానిక సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, వర్షం కురిసినప్పుడు రోడ్లన్నీ నీటితో నిండిపోతున్నాయని వివరించారు. స్పందించిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి, డ్రైనేజీతో పాటు వర్షపు నీటి సమస్యల పరిష్కారానికి సకాలంలో అవసరమైన పనులు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీఈ వెన్నిల్ గౌడ్, ఏఈ రాజ్ కుమార్, హెచ్‌ఎండబ్ల్యూఎస్
అధికారి సత్యనారాయణ, దుబ్బ నర్సింహ రెడ్డి, కలూరి వేణు, అయోధ్య, సల్లా ప్రభాకర్ రెడ్డి, జీవన్ రెడ్డి, డేవిడ్, కిషోర్, కేశవ రావు, పవన్, బాలు, నాగరాజు, రాజ్ కుమార్, చంద్రం ప్రశాంత్, చారి, శ్రీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Comments