భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

నాచారం, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):

వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని నాచారం ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నాచారం కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాచారం ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో వాసవి మాత విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత చరిత్రను పఠించి ఆమె త్యాగాన్ని స్మరించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నాచారం అధ్యక్షుడు శ్రీరామ్ సత్యనారాయణ (బండల), గౌరవ అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, ప్రధాన కార్యదర్శి బొగ్గారపు రమేష్ గుప్తా, కోశాధికారి భాస్కర్‌తో పాటు కార్యవర్గ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వాసవి మాత ఆదర్శాలు నేటి సమాజానికి మార్గదర్శకమని వక్తలు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News