డబ్బులకోసం కాదు అభివృద్ధి కోసం ఓటు వేయండి ఈటల రాజేందర్
_అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీ లో పాల్గొని బిఆర్ఎస్ కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు)
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీ లో పాల్గొన్నారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, "డబ్బులు మద్యం మాత్రమే నమ్మితే మాలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండలేరు. నన్ను కోసినా రూపాయి లేదు అని ముఖ్యమంత్రి చెబుతున్నప్పుడు, అభివృద్ధి సాధ్యం కాదు" అని వ్యాఖ్యానించారు.ఆయన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పెన్షన్లు పెంచకపోవడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతి కేటాయించకపోవడం వంటి సమస్యలను గమనించి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ, కేంద్రం ద్వారా వచ్చే నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని చెప్పారు.ఈటల, "భారత ప్రభుత్వ నిధుల ద్వారా హైదరాబాదు లో ఫ్లైఓవర్‌లు, రైల్వే స్టేషన్ ఆధునీకరణ వంటి పనులు సాధ్యమయ్యాయి. మేము డబ్బులతో ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనుకోము" అన్నారు.రేలీ లో ఆయన కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలనను ఘాతుకరంగా విమర్శిస్తూ, పేదలకు ఇచ్చిన భూభూములను అడ్డుకోవడం, పేద ఇళ్లను కూల్చడం వంటి ఘటనలపై దృష్టి సారించారు.అంతేకాకుండా ఈటల రాజేందర్, మున్సిపాలిటీ అభివృద్ధికి బాధ్యత మాకు అప్పగిస్తే
ప్రజల కోసం గర్వంగా పనులు చేస్తామని హామీ ఇచ్చారు. చివరగా, ఆయన ప్రజలకు “కమలం పువ్వు గుర్తుతో ఓటు వేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి” అని పిలుపునిచ్చారు.


Comments