సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం… లారీ ఢీకొని వ్యాపారి మృతి.

సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం… లారీ ఢీకొని వ్యాపారి మృతి.

సత్తుపల్లి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పొదిలి నారాయణరావు (59) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
వ్యాపారం నిమిత్తం సత్తుపల్లి పట్టణానికి వచ్చిన నారాయణరావు ప్రమాదానికి గురయ్యారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం, వెనుక నుంచి వచ్చిన లారీ IMG-20260129-WA0052ఢీకొనడంతో ఆయన అదుపుతప్పి కింద పడిపోయి, లారీ టైరు కింద నలిగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాద తీవ్రతతో సంఘటన స్థలంలో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడు నారాయణరావు ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం చేస్తూ స్థానిక మండలాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఫ్యాన్సీ ఐటమ్స్ విక్రయించేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Tags:

Post Your Comments

Comments

Latest News