బస్తీ బాటలో మౌలిక సదుపాయాల పరిష్కారానికి నెమలి అనిల్ ముందడుగు

బస్తీ బాటలో మౌలిక సదుపాయాల పరిష్కారానికి నెమలి అనిల్ ముందడుగు

మల్లాపూర్, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధి లోని భవానీ నగర్ కాలనీలో ఇటీవల నెమలి అనిల్ కుమార్ నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో గుర్తించిన డ్రైనేజ్, తాగునీటి సమస్యలపై పరిష్కారం దిశగా ఆయన చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ వాటర్ వర్క్స్ డీజీఎం సతీష్, ఏఈ సిరాజుద్దీన్‌లను కలిసి, స్థానికులు తనకు తెలియజేసిన సమస్యలతో పాటు గతంలో సమర్పించిన వినతిపత్రాలకు సంబంధించిన పెండింగ్ పనులపై విస్తృతంగా చర్చించారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సరఫరాలో అవకతవకల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రజల సమస్యలను పరిశీలించిన అధికారులు, భవానీ నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేలా అవసరమైన చర్యలు చేపడతామని నెమలి అనిల్ కుమార్‌కు హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న పనులను దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ వి. శ్రీనివాస్, సీనియర్ నాయకులు కె. రాజేష్, అన్వర్, కృష్ణ తదితరులు పాల్గొని నెమలి అనిల్ కుమార్ ప్రయత్నాలకు మద్దతు తెలిపారు. ప్రజల మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నెమలి అనిల్ కుమార్ నిరంతరం పోరాడుతున్నారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News