యువ న్యాయవాదిని సత్కరించిన సోయం వీరభద్రం.

విద్య ద్వారానే సమాజంలో గౌరవం.

యువ న్యాయవాదిని సత్కరించిన సోయం వీరభద్రం.

అశ్వరావుపేట, జనవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ల అంకిత ఇటీవల ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా, అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకుడు సోయం వీరభద్రం ఆదివారం అంకిత స్వగృహం వద్ద ఘనంగా శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ, విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన అంకిత జాతీయ స్థాయి న్యాయ పరీక్షలో విజయం సాధించడం అభినందనీయమని తెలిపారు. న్యాయవాద రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం అంకిత తల్లిదండ్రులు కొనకళ్ల శ్రీనివాసరావు, విజయలక్ష్మిని సత్కరించారు.
తదుపరి అశ్వరావుపేట మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జుజ్జరి వెంకన్నబాబు నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. అలాగే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుమలకుంట గ్రామ పంచాయితీ నుంచి బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మాడి ముత్యాలరావును వారి నివాసంలో కలిసి ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని సూచిస్తూ ఆయనకు మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బొల్లికొండ చెన్నారావు, జుజ్జురి సత్యనారాయణ, యువజన నాయకులు పానుగంటి చెన్నారావు, దాసరి రాజా, సిరి బత్తుల శ్రీనివాసరావు, కోర్సా జోగారావు, పోతురాజు, మోడియం పుల్లయ్య, కుర్సం వెంకటేష్, డెరంగుల చిన్నబాబు, రామకృష్ణ, మడకం ముత్యాలరావు, మధులత, మాడి సీత, అశ్వరావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకుడు వాడే వీరస్వామి తదితరులు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.IMG-20260119-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!