మల్లాపూర్ డివిజన్ సమస్యలపై అధికారులతో గ్రేటర్ కాంగ్రెస్ నేతల భేటీ
మల్లాపూర్, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ వార్డు కార్యాలయంలో నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్‌ను గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లాపూర్ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి వినతి పత్రాలను డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు.అనంతరం మల్లాపూర్ ఏఈ సూరజ్‌ను కలిసిన నెమలి అనిల్ కుమార్, కె.ఎల్. రెడ్డి నగర్ మరియు ఎస్.వి. నగర్ కాలనీల్లోని పార్కులు, ఓపెన్ జిమ్స్ అభివృద్ధి పనుల పురోగతిపై వివరంగా చర్చించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా అధికారుల సహకారంతో తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల తరఫున పోరాటం చేస్తుందని నెమలి అనిల్ కుమార్ తెలిపారు.


Comments