నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి కాలనీల్లో కార్పొరేటర్ పర్యటన
నాచారం, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్‌లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ మున్సిపల్ అధికారులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నెలకొన్న రోడ్ల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైన చోట్ల వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, ఏఈ స్పందన, వర్క్ ఇన్స్పెక్టర్ చారి పాల్గొన్నారు. అలాగే కాలనీ నాయకులు నరసింహా, ప్రసాద్ శేఖర్ గౌడ్‌తో పాటు స్థానికులు పాల్గొని తమ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, కాలనీల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు.


Comments