చీకరు చెట్టు తాండ బుక్ కీపర్ గా మోతి బాయి ని కొనసాగించాలి

మహిళా సంఘాల ఏకగ్రీవ తీర్మానంతో కలెక్టర్ కు వినతి పత్రం 

చీకరు చెట్టు తాండ బుక్ కీపర్ గా మోతి బాయి ని కొనసాగించాలి

పెద్దమందడి,జనవరి28(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం చీకరు చెట్టు తాండ గ్రామంలోని మహిళా సంఘాలు వీఓఏ (బుక్ కీపర్) పదవిని గతంలో సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన మోతి బాయి కే తిరిగి అప్పగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి.
మోతి బాయి  తన విధి కాలంలో మహిళా సంఘాల లెక్కలు, పొదుపు ఖాతాలు, రికార్డుల నిర్వహణలో పూర్తి పారదర్శకతతో పనిచేసి గ్రామ మహిళల విశ్వాసాన్ని సంపాదించారని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు.ఆమె సేవల వల్ల మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యాయని, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యాయని తీర్మానంలో స్పష్టం చేశారు.అయితే 2025 డిసెంబర్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన అనంతరం, ఆమె గత సేవలను గుర్తించిన గ్రామ మహిళలు సమావేశమై మళ్లీ మోతి బాయినే వీఓఏగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక గ్రామ మహిళల సమష్టి నిర్ణయమని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మహిళా సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
ఇటీవల పెద్దమందడి మండల మహిళా సమాఖ్య భవనం సమీపంలో గ్రామ సర్పంచ్ భర్త రాజకీయ కక్షతో తన వర్గానికి చెందిన వ్యక్తిని వీఓఏగా నియమించాలనే ఉద్దేశంతో అనవసర ఆరోపణలు చేస్తూ, మహిళా సంఘాల నాయకులపై దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరింపులకు దిగుతున్నారని మహిళలు ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చి సమావేశం నిర్వహించగా, గ్రామ మహిళా సంఘాలన్నీ మోతి బాయినే వీఓఏగా కావాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో గ్రామ మహిళల ఏకాభిప్రాయాన్ని గౌరవించి, చీకరు చెట్టు తాండ వీఓఏ పదవిని మోతి బాయి కి తిరిగి కేటాయించాలని కోరుతూ మహిళా సంఘాల తరఫున బుధవారం మండల అభివృద్ధి అధికారి, జిల్లా కలెక్టర్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.వీఓఏ నియామకంలో జాప్యం మరియు అనవసర జోక్యాల వల్ల మహిళా సంఘాల పనితీరులో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, దీనివల్ల గ్రామ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ మహిళల అభిప్రాయాలను గౌరవించి, మోతి బాయి కి వీఓఏ పదవిని తిరిగి అప్పగించాలని ఈ తీర్మానం ద్వారా సంబంధిత అధికారులను గట్టిగా కోరారు.ఈ తీర్మానానికి గ్రామంలోని మహిళా సంఘాల నాయకులు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News