మున్నూరుకాపుల ఐక్య గళం.. అభివృద్ధికి సంకల్పం

మున్నూరుకాపుల ఐక్య గళం.. అభివృద్ధికి సంకల్పం

_జిల్లా మున్నూరుకాపు సంఘం ప్రథమ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహణ

_మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు అండగా నిలుస్తాం: జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ పటేల్

చర్లపల్లి, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మున్నూరుకాపుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా జిల్లా మున్నూరుకాపు సంఘం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. బుధవారం చర్లపల్లి సమీపంలో జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది.ఈ సమావేశంలో జిల్లాలోని మున్నూరుకాపుల రాజకీయ, సామాజిక భవిష్యత్తుకు కీలకమైన అంశాలపై చర్చించి మూడు ప్రధాన అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్నూరుకాపుల ఆత్మగౌరవాన్ని చాటేలా అభ్యర్థులకు అజెండా పరంగా సంపూర్ణ మద్దతు తెలపాలని తీర్మానించారు. అలాగే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. సంఘ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం కొత్త బ్యాంక్ ఖాతా ప్రారంభం, సంఘ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.సంఘ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఎన్‌ఆర్‌ఐ తరణ్ బీమిని పటేల్‌ను ఐటీ సెల్ కన్వీనర్‌గా నియమించారు. అదేవిధంగా ఆకుల శ్రీనివాస్, మహేంద్ర, తోట నరేష్ పటేల్, ఆకుల మోహన్, ఆకుల యశవంత్, సంకూరి ప్రవీణ్ కుమార్, గుండా నరేందర్‌లకు వివిధ బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ, జిల్లాలోని మున్నూరుకాపులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి సంఘాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. త్వరలోనే మండల స్థాయి కమిటీలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ సమావేశంIMG-20260128-WA0046లో జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News