కమల్ మిత్ర మోటార్స్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు.
సత్తుపల్లి, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
కమల్ మిత్ర మోటార్స్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సును బుధవారం సత్తుపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ ఓన్ డ్యామేజ్, పర్సనల్ యాక్సిడెంటల్, థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి అని వివరించారు. అలాగే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం గురించి విపులంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ మేళా, మెగా సర్వీస్ క్యాంప్‌ను కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ ఎంవీఐ రాజశేఖర్ రెడ్డి, సేల్స్ ఏఎస్‌ఎం జి. కృష్ణ, సర్వీస్ ఏఎస్‌ఎం ఎల్.వి. బాలాజీ, జీఎం జగదీష్, సర్వీస్ జీఎం పవన్ పాల్గొన్నారు. అలాగే ముస్తాక్, మధు సాగర్, సీనియర్ మెకానికులు హాజరయ్యారు.
కమల్ మిత్ర మోటార్స్ యాజమాన్యం తరఫున ఎండీ రెహ్మద్ పాషా, ఆబీద్ పర్వీన్, షాకీర్, వాహిద్ నవీన్, చందు, సన్నీ, వలి, మిద్దె శీను, సాయి, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఈ నెల 29వ తేదీ గురువారం నిర్వహించబడుతుందని ఎండీ రెహ్మద్ పాషా తెలిపారు.


Comments