ఘట్‌కేసర్ సర్కిల్‌లో పారిశుధ్య కేంద్రాల తనిఖీ
_డోర్ టు డోర్ చెత్త సేకరణ తప్పనిసరి : గ్రేటర్ జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి
ఘట్‌కేసర్, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రేటర్ జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి, ఐఏఎస్ ,ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ప్రాథమిక డంపింగ్ యార్డ్‌ల సేకరణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక చెత్త సేకరణ కేంద్రాల పనితీరును పరిశీలించి, ద్వితీయ సేకరణ (సెకండరీ పాయింట్లు) వ్యవస్థపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు.డోర్ టు డోర్ విధానంలో స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా జీవీపీ (గ్యార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు) ఉండకుండా పూర్తిగా తొలగించాలని స్పష్టమైన సూచనలు చేశారు.
అలాగే ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఏబీసీ (జంతు జనన నియంత్రణ కేంద్రం)ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా పునర్వినియోగం చేస్తూ సేవల నాణ్యతను మెరు
గుపర్చాలని సూచించారు.నగర పారిశుధ్య ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ప్రతి స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, స్వచ్ఛత కార్యక్రమాలను బలోపేతం చేయాలని అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి తెలిపారు.


Comments