నాచారంలో ఐరిస్ ఫ్లోరెట్స్ ప్లే స్కూల్ ప్రారంభం
సాయి నగర్ కాలనీలో ఆధునిక సదుపాయాలతో నూతన విద్యా సంస్థ
నాచారం, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరిస్ ఫ్లోరెట్స్ ప్లే స్కూల్‌ను నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐరిస్ ఫ్లోరెట్స్ సీఎండీ శిరీష్ తూర్లపాటి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, నాచారం పరిధిలో ఇప్పటివరకు ఉన్న ప్లే స్కూల్స్‌లో ఐరిస్ ఫ్లోరెట్స్ ప్లే స్కూల్ అత్యంత ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిన్నారుల సర్వాంగీణ అభివృద్ధికి అవసరమైన విద్య, భద్రత, ఆటపాటలకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక బోధనా విధానాలతో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలిపారు.చిన్న పిల్లల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని సురక్షిత వాతావరణంలో విద్యనుఅందించేలా స్కూల్‌ను రూపొందించారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఈ ప్లే స్కూల్ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ప్లే స్కూల్ నిర్వాహకులు నాగేష్, శిరీష్‌లను కార్పొరేటర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ సిబ్బంది రవికాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments