అరైవ్ అలైవ్’ ఉద్యమంగా మారాలి

అరైవ్ అలైవ్’ ఉద్యమంగా మారాలి

- రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి.

- సత్తుపల్లి ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి.

సత్తుపల్లి, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):

‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం నినాదంగా పరిమితం కాకుండా, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని సత్తుపల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి అన్నారు. సత్తుపల్లిలోని లారీ యూనియన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలన్న ఆశ వారి కుటుంబ సభ్యుల్లో ఉంటుందని, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం జరిగితే ఆ కుటుంబాల బాధను ఎవరూ తీర్చలేరని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరగవని, మన నిర్లక్ష్యం, అతివేగమే ప్రధాన కారణాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక కుటుంబాలు తమ ప్రధాన ఆధారాన్ని కోల్పోయి వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు తమపై ఉన్న బాధ్యతను గుర్తించి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలని అన్నారు. మొబైల్ ఫోన్ వినియోగం, అతివేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని హెచ్చరించారు.
“మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఇంటివద్ద ఎదురు చూస్తున్నారు” అనే విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకొని జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ రోడ్డు భద్రతా అవగాహనIMG-20260120-WA0049 కార్యక్రమాలు సత్తుపల్లి పరిధిలోని రద్దీ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లతో పాటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News