సుదర్శన్ దశదిన కర్మలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ, పరమేశ్వర రెడ్డి

సుదర్శన్ దశదిన కర్మలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ, పరమేశ్వర రెడ్డి

ఉప్పల్, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ కాలనీకి చెందిన సుదర్శన్ ఇటీవల మరణించగా, ఆయన దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడవి, పర్యావరణ, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో కలిసి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుదర్శన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News