నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి
వనపర్తి,జనవరి20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి మండలం చందాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి భార్య మాధవి మృతి చెందిన విషయం గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి శుక్రవారం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి ని మరియు కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యం చెప్పారు. మాధవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు సమద్ మియా, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, వనపర్తి మండల్ కిసాన్ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, గోపాల్‌పేట్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, వనపర్తి మండల్ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments