పెబ్బేరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు షాక్

కాంగ్రెస్‌లో చేరిన ముఖ్య నాయకులు

పెబ్బేరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు షాక్

పెబ్బేరు,జనవరి28(తెలంగాణ ముచ్చట్లు):

పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్ ప్రధాన నాయకులు బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శివసేన రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.మాజీ ఎంపిటిసి, మాజీ కోఆప్షన్ సభ్యుడు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్, మాజీ వార్డు సభ్యుడు ఐజాక్‌తో పాటు బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంధం వెంకటయ్య, నరేందర్‌లు కాంగ్రెస్ గూటికి చేరారు.ఈ సందర్భంగా తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్న సమయంలో చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు కొత్తగా చేరిన నాయకులు మనస్ఫూర్తిగా కృషి చేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ పాలనలో పదవుల్లో ఉన్నప్పటికీ తగిన మర్యాదలు లభించలేదని, ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి నిరుపేదకు చేరుతున్నాయని ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News