భవానీ నగర్‌లో బస్తీ బాట కార్యక్రమం
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంమల్లాపూర్ డివిజన్ పరిధిలోని భవానీ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేత నెమలి అనిల్ కుమార్ నేతృత్వం వహించగా, స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.కాలనీవాసులతో కలిసి విద్యుత్ పోల్స్‌కు సంబంధించిన సమస్యలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఇబ్బందులు, అలాగే నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనుల పురోగతిని పరిశీలించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మక్తాల
బాలరాజ్ గౌడ్, జాయింట్ సెక్రటరీ ఉండం శ్రీనివాస్, కొయలకొండ రాజేష్, లక్ష్మీపతి, అన్వర్, అశోక్ గౌడ్, విలాయత్ ఖాన్, మహేష్ పాల్గొన్నారు.అలాగే స్థానిక నాయకులు బాబు భాయ్, వెంకటేష్, రమేష్ నాయక్, ప్రవీణ్, అమ్ము భాయ్, రఘు, మహిళలు తదితరులు పాల్గొని తమ సమస్యలను వివరించారు.


Comments