స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కుషాయిగూడలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
కాప్రా, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
స్వచ్ఛ సర్వేక్షన్ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆరుబయట మలమూత్ర విసర్జన చేసే వారు, చెత్తాచెదారాన్ని రోడ్లపై విచ్చలవిడిగా పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కుషాయిగూడ ప్రాంతంలోని డీ–మార్ట్ ఓపెన్ ఏరియా పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు.ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఆరుబయట మూత్ర విసర్జన చేసిన వారికి పెనాల్టీలు విధించారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, డీ–సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అధికారి రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఎస్‌ఎఫ్‌ఏ కే.లక్ష్మి, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెనాల్టీ విధించడమే కాకుండా, పూలదండ వేసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరుబయట మలమూత్ర విసర్జన వల్ల ప్రజారోగ్యానికి కలిగే అనర్థాలు, పరిసరాల కాలుష్యం గురించి ప్రజలకు వివరించామని డిప్యూటీ కమిషనర్ శ్రీహరి తెలిపారు.
ప్రజలు స్వచ్ఛత నిబంధనలు పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని ఆయన కోరారు.


Comments