వెల్టూర్‌లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్ ఆధ్వర్యంలో బత్తుల అరుణ, మణిగిల్ల బాలకృష్ణ, విద్యాసాగర్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వడ్డే శేఖర్ మాట్లాడుతూ..అనారోగ్యం, ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసాగా నిలుస్తోందని తెలిపారు.ఎమ్మెల్యే మేఘా రెడ్డి సూచనలతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తోందన్నారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నదని చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ అధ్యక్షులు బాబు రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున్, వార్డు సభ్యులు నాగభూషణ్, నాగరాజు గౌడ్, మద్దూరు స్వాతి నరసింహ, సీనియర్ నాయకులు డీలర్ విజయ్ కుమార్, జగతి రెడ్డి, మహేష్ రెడ్డి, అనంతరెడ్డి, చందు రెడ్డి, కొండన్న , మిల్లర్ రాజు, గుండెల ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments