శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తృతీయ వార్షికోత్సవంలో పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు
ఉప్పల్, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారి గుట్టపై నిర్వహించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.మంగళవారం ఘనంగా నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన కాలజ్ఞానం ప్రజలకు మంచి–చెడుల మధ్య, ధర్మ–అధర్మాల మధ్య తేడాను తెలియజేసే గొప్ప గ్రంథంగా ప్రసిద్ధి చెందిందన్నారు. స్వామి కేవలం భవిష్యత్తును చెప్పినవాడే కాకుండా, ప్రజలను సన్మార్గంలో నడిపించిన మహానీయుడని కొనియాడారు.నిజాయితీగా జీవించడం, ఇతరులకు సహాయం చేయడం, భక్తి మరియు క్రమశిక్షణతో ఉండడం వంటి విలువలను స్వామి తన బోధనల ద్వారా ప్రజలకు అందించారని, ఆయన ఉపదేశాలు నేటికీ మన జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కొంపల్లి బాలరాజ్, ఆగం రెడ్డి, చిల్కానగర్ డివిజన్ అధ్యక్షుడు ములకలపల్లి రాజేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి మహేందర్ ముదిరాజ్, నారోజు రాధాకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మంచాల రఘు, ఉపాధ్యక్షులు గండికోట గణేష్, బీసీ సెల్ అధ్యక్షుడు దండుగుల శంకర్, అలాగే సౌదారపు శివ, జగదీష్ ముదిరాజ్, డేవిడ్, కిరణ్, ఫహీం తదితరులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments